| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోలీస్ కార్యాలయంలో గాంధీ వర్ధంతి వేడుకలు

పోలీస్ కార్యాలయంలో గాంధీ వర్ధంతి వేడుకలు

గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి వందనం చేశారు

డైలీ భారత్, మెదక్:గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్.పి డా. బి.బాలస్వామి  

మంగళవారం నాడు గాంధీజీ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో జిల్లా ఎస్.పి డా.బి బాలస్వామి ఐ.పి.ఎస్. జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ .ఎస్.మహేందర్ , పోలీస్ అధికారులు,  సిబ్బంది మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల అమరవీరులు త్యాగాలను స్మరిస్తూ వారి ఆత్మశాంతి గురించి  తేదీ 30-01-2024 ఉదయం 11:00 గంటలకు జిల్లా పోలీస్ కార్యాల యంలో,  అలాగే జిల్లా పోలీస్ స్టేషన్ల లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి  మాట్లాడుతూ. సత్యం, అహింస సిద్ధాంతాలు అనే శాంతి మంత్రంతో దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన మహాత్మాగాంధీ ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో ఆయుధం లేకుండా పోరాటం చేసిన సమరయోధుడు గాంధీ అని కొనియాడారు.  నేటి మన ఈ స్వతంత్రం మహా వీరుల అసమాన త్యాగఫలం అని  దేశ స్వతంత్రం కొరకు త్యాగాలు చేసిన ఎందరో అమర వీరులకు మనమెల్లవేళలా ఋణపడి ఉండాలని, ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవా దృక్పథమూ మన జీవితంలో ప్రధానాంశాలుగా కావాలని ఈ సందర్భంగా అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి,అడ్మిన్ .ఎస్.మహేందర్ , ఏ.ఆర్.డి.ఎస్.పి.శ్రీ.రంగా నాయక్, ఎస్.బి.సి.ఐ.సందీప్ రెడ్డి ,డి.సి.ఆర్.బి.సి.ఐ .ప్రకాష్ గౌడ్ ,అడ్మిన్ ఆర్.ఐ.అచ్యుత రావ్ , డిపిఓ సిబ్బంది, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది, జిల్లాలోని పోలీస్ స్టేషన్ లోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Previous ఆగివున్న బస్సు కు అగ్ని ప్రమాదం
Next కలెక్టర్ కార్యాలయంలో గాంధీ వర్ధంతి వేడుకలు
ADVERTISEMENT