డైలీ భారత్, తెలంగాణ: జనవరి 29 తేదీ సోమవారం రోజు న ఏనుమాముల మార్కెట్ ఆవరణలో సీఐటీయూ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి కాశిబుగ్గ ఏరియా సిఐటియు కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జనవరి 31 తేదీ న హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో సిఐటియు బహిరంగ సభ కు ముఖ్యఅతిథిగా సిఐటియు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ తపన్ సెన్ హాజరవుతున్నారు సిఐటియు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మాజీ కార్యదర్శి బి వి రాఘవులు హాజరవుతున్నారు ఈ సభని జయప్రదం చేయడానికి వరంగల్ జిల్లా కార్మికులు ఎక్కువ మంది పాల్గొని విజయవంతము చేయగలరని యాదగిరి కోరారు దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కనీస వేతనాలు ధరలు తగ్గించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ ఏరియా సిఐటియు నాయకులు కంది రవి ఎస్కే పాషా జన్ను ప్రవీణ్ జన్ను చిట్టి. ఏనుగంటి రాజలింగం జన్ను అఖిల్ జనగాం నాగరాజు పోలె బోయిన శ్రీను అనిత మంజుల సమ్మక్క గౌస్ పాషా మనీలా శివాజీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు