| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిజం మాట్లాడిన... అందుకే అరుణమ్మ ముఖం చాటేసింది

నిజం మాట్లాడిన... అందుకే అరుణమ్మ ముఖం చాటేసింది

మీడియాతో మాట్లాడిన షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ మంత్రి డికె అరుణ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో 15 కోట్ల రూపాయలు ఇస్తేనే పోటీ చేస్తానని డిమాండ్ చేసిందని సిడబ్ల్యూసి ప్రత్యేక అహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఏదైనా రామాలయంలో బహిరంగ ప్రమాణానికి సిద్ధమని ఇరువురి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు జరిగాయి. ఈ మేరకు జనవరి 28, ఆదివారం చల్లా వంశీచంద్ రెడ్డి చెప్పిన సమయం కంటే ముందుగానే కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పట్టణంలోని రామాలయ దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సవాల్‌కు సిద్ధమన్న డికె అరుణ కోసం ఎదురుచూశారు.చివరికి ఆమె రాకపోవడంతో స్థానిక విలేకరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహబూబ్‌నగర్,మక్తల్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరిలతో కలిసి చల్లా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ..ధర్మానికి, నీతికి, నిజాయితీకి నిలువెత్తు రూపం శ్రీరాముడని, అలాంటి ఈ పుణ్యక్షేత్రం వేదికగా తాను చెప్పింది నిజం కాబబ్టే..సవాల్ స్వీకరించకుండా డికె అరుణ తోక ముడిచి ముఖం చాటేసారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆధారాలతో కూడిన ఆరోపణలు చేయాలే తప్పా అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజల్లో ఇలాగే భంగపాటు తప్పదని వంశీ చంద్ రెడ్డి హితవు పలికారు ఈ కార్యక్రమంలో

యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఖదీర్, యువజన కాంగ్రెస్ స్టేట్ సెక్రెటరీ అందే మోహన్ , పట్టణ అధ్యక్షుడు జఫర్, ఫరక్ నగర్ మండల అధ్యక్షుడు గణేష్, అందె శ్రీకాంత్, బచ్చలి నరేష్, హలీం సాకీబ్, సతీష్,,వంశీ ,శీను, తదితరులు ఉన్నారు

Previous కేటీఆర్ కు అధికారం మీద వ్యామోహం తప్ప ప్రజలపై ప్రేమ కాదు: మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ
Next ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి
ADVERTISEMENT