| Daily భారత్
Logo


కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు

News

Posted on 2024-03-28 18:15:18

Share: Share


కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు

కల్వకుంట్ల తారక రామారావు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 నుంచి 20 లక్షల ఎకరాలు పంట నష్టం.

తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయాలి

మేడిగడ్డ వద్ద కాపర్ డ్యాం నిర్మించి రైతులు నష్టపోకుండా చూడాలి.

డైలీ భారత్,సిరిసిల్ల: కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఇటీవల వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరువు కాలం తెచ్చింది కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని తీవ్రంగా విమర్శించారు . రైతులకు అడగకముందే రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మరోవైపు బ్యాంకు అధికారులు రైతులను తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వేసంగి రుణమాఫీ సిద్ధం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7 లక్షల కోట్ల నిధులను దారిమల్లించారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితులను తెలుసుకునేందుకు బిఆర్ఎస్ పార్టీ రైతుల వద్దకు వెళుతుందని తెలిపారు. గతంలో ఇదే సంవత్సరం కాలేశ్వరం నీటితో రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రైతుల రుణాలు మాఫీ చేయడంతో పాటు కాలేశ్వరం మేడిగడ్డ వద్ద కాపర్ డ్యాం నిర్మించి నీటిని తరలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎంపీపీ పడగల మానస, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్, మాట్ల మధు, పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం

Readmore >
Image 1

భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Readmore >
Image 1

ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య?

Readmore >
Image 1

ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

Readmore >
Image 1

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Readmore >