| Daily భారత్
Logo


600కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టివేత

News

Posted on 2024-04-29 07:35:36

Share: Share


600కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టివేత

డైలీ భారత్, గుజరాత్: భారత్‌లో అక్రమంగా డ్రగ్స్‌ను తరలించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ బోటును ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో బోటును అడ్డుకున్నారు దీనిలో ఉన్న 14 మంది పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకుని *86 కిలలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ మార్కెట్లో దాదాపు రూ.600 కోట్ల* వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. గత కొంత కాలంగా భారత్‌లోకి డ్రగ్స్‌ను తరలించడానికి ఉగ్రవాదులు, స్మగ్లర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కోస్ట్ గార్డ్‌తో పాటు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా పెట్టాయి.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బోటు గురించిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్ అందించగా భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది బోటును పట్టుకోవడానికి నౌకలు, విమానాలను మోహరించి, ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. బోటును పట్టుకున్నాక దానిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా 86 కిలోల డ్రగ్స్‌ను కనిపెట్టారు. స్వాధీనం చేసుకున్న బోటును, దానిలో పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ కోసం పోర్‌బందర్‌కు తరలించారు.

Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >
Image 1

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Posted On 2024-05-14 18:54:45

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన ఆర్డీఒ పై చర్యతీసుకోవాలి

Posted On 2024-05-14 13:43:30

Readmore >