| Daily భారత్
Logo




సిరిసిల్ల నేతన్నల హర్షం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు

News

Posted on 2026-04-05 19:02:32

Share: Share


సిరిసిల్ల నేతన్నల హర్షం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు

డైలీ భారత్, సిరిసిల్ల:  సెస్ లో సిరిసిల్ల మరమగ్గాల నిర్వాహకుల విషయంలో సత్వరం స్పందించిన ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డికి వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు తాటిపాముల దామోదర్ మరమగ్గాల అనుబంధం సంఘాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు తాటిపాముల దామోదర్ తో పాటు నాయకులు మాట్లాడుతూ సెస్ పరిధిలో ఉన్న మరమగ్గాల నిర్వాహకులకు సంబంధించి అనేక రోజులుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ,అనుమానాలను ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి  తొలగించారని అన్నారు. సిరిసిల్లలోని మరమగ్గాల పరిశ్రమ అనుబంధ పరిశ్రమల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల మరమగ్గాల యూనిట్లకు సంబంధించి 25 హెచ్పి ల వరకు 50 శాతం సబ్సిడీతో మూడవ కేటగిరీ నుంచి నాలుగవ కేటగిరికి మార్చనున్నట్లు తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. వీటితోపాటు బ్యాక్ బిల్లింగ్ విషయంలో సానుకూలంగా అధికారులు స్పందించడం కృతజ్ఞతలు తెలిపారు. ఎన్పీడీసీఎల్ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల సుమారు 600 పైగా మరమగ్గాల యూనిట్లు పెరిగి అవకాశం ఉందని సుమారు 5000 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని  స్పష్టం చేశారు. అనేక విషయాలలో ఎన్పీడీసీఎల్ అధికారులు సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సహకరించిన చేనేత  జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జ్ కే.కే మహేందర్ రెడ్డి, డి.సి.సి .అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తో పాటు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బూట్ల నవీన్, యెల్దండీ దేవదాస్, సాప గణేష్, రాపేల్లి ప్రసాద్, బండారి అశోక్, పినగాని రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >