Posted on 2026-03-02 18:39:02
అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, 164 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 61, గృహ నిర్మాణ శాఖకు 25, జిల్లా పంచాయతీ కార్యాలయం, డీఆర్డీఓకు 13 చొప్పున, సంక్షేమ శాఖకు 09, ఉపాధి కల్పన శాఖకు 08, ఎండీ సెస్ 05, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 04 చొప్పున, ఎక్ష్సైజు శాఖ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు మూడు చొప్పున, పౌర సరఫరాల శాఖ, విద్యా శాఖ, వైద్య శాఖ, ఆర్ అండ్ బీకి రెండు చొప్పున, జిల్లా వ్యవసాయ శాఖ, రవాణా శాఖ, డీఎం ఆర్టీసీ సిరిసిల్ల, శ్రీ రాజరాజేశ్వర ఆలయ ఈఓ, నీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఎస్పీ కార్యాలయానికి 01 చొప్పున వచ్చాయి. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆయా శాఖల తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >