| Daily భారత్
Logo




ఏసీబీ వలలో కాకతీయ యూనవర్సిటీలోని అధికారులు

News

Posted on 2024-01-05 22:34:18

Share: Share


ఏసీబీ వలలో కాకతీయ  యూనవర్సిటీలోని అధికారులు

ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్

రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కిష్టయ్య

యూనివర్సిటీలో ఆయనవి కీలక బాధ్యతలు

ఏ.ఆర్. కిష్టయ్య వెనుక వున్న తిమింగలం ఏవరు..?

డైలీ భారత్, వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. అయితే విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ. 3 కోట్ల కుంభకోణంపై ఏ ఆర్ కిష్టయ్య, ప్రిన్సిపాల్ బన్న అయిలయ్య పై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే వీసీ రమేష్ కిష్టయ్య ను క్యాంపస్ కు మార్చారు. న్యాక్ కోసం కేటాయించిన రూ.10 కోట్ల బిల్లుల్లో చేతి వాటం కోసమే కిష్టయ్యను క్యాంపస్ కు వీసీ బదిలీ చేయించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీ లో కీలకైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్య ను ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా వీసీ నియమించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. న్యాక్ సందర్భంగా వర్సిటీలో రోడ్లు, హాస్టళ్లు, ఇతర బిల్డింగ్ ల కోసం రూ.10 కోట్ల కేటాయించారు. వీటిలో కమీషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్ తో పాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్ కు కూడా కిష్టయ్య నే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా నియమించారు. ఒక్క హాస్టల్ లోనే పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. యితే ఇంకా దీని వెనుక పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయనే అనుమానంతో ఏసీబీ విచారణ జరుపుతోంది. బిల్లులు తయారు చేసేదీ తానే… ఆ బిల్లులు పాస్ చేసేది తానే కావడంతో ఏ.ఆర్ కిష్టయ్య చేతి వాటానికి అంతు లేకుండా పోయిందనే అరోపణలు ఉన్నాయి.

Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >