| Daily భారత్
Logo




ఇందిరమ్మ ఇండ్లు ఉపాధి హామీ పథకం అమలు పురోగతి పై సమీక్ష

News

Posted on 2025-10-16 22:29:42

Share: Share


ఇందిరమ్మ ఇండ్లు ఉపాధి హామీ పథకం అమలు పురోగతి పై సమీక్ష

డైలీ భారత్ న్యూస్, వరంగల్:జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్లు మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (EGS), గ్రామ పంచాయతీలలో ట్యాక్స్     కలెక్షన్ , పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ వర్క్స్  పువగతి పై నిర్వహించిన   సమీక్ష సమావేశం లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జడ్పీ సీఈవో  మరియు ఇందిరమ్మ ఇండ్ల నోడల్ అధికారి రాంరెడ్డి , డిప్యూటీ కమిషనర్ ప్రసన్న,హౌసింగ్ పిడి గణపతి, డిపిఓ కల్పన, పిఆర్ఇఇ ఇజ్జగిరి , పాల్గొని  సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం  నిర్ణీత గడువులోపు ఇండ్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు.  జిల్లా లో మొత్తం  9457 కు గాను ఇప్పటివరకు 4941 గ్రౌండింగ్ కాగా ఇంకనూ4516  పెండింగ్  లో ఉన్న ఇండ్లకు స్వయం సహాయక గ్రూపులలో రుణాలు ఇప్పించి వారిని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు  ఈ  నెల చివరి వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ లో  పని దినాలు కల్పించుటకు జాబ్ కార్డులు అందించాలని  అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఆలస్యం అవుతున్న మండలాలను ఫీల్డ్  క్షేత్ర స్థాయి లో  పర్యటించి అందుకు  పనులు పురోగతి పెంచాలని సంబందిత అధికారులను ఆదేశించారు. 

లబ్దిదారులకు స్టేజ్ ల వారిగా  అందవలసిన నిధుల సకాలం లో అందేలా చూడాలని .   సిమెంట్, ఇసుక, ఇటుక తదితర సామగ్రి సరఫరా కు ప్రభుత్వం  నిర్ణయించిన ధరలు చెల్లించే లా  చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి మండలంలో పెండింగ్ జాబితాను సిద్ధం చేసి అక్టోబర్ 31  వరకు  జిల్లా టార్గెట్  పూర్తి  చేసి నివేదికలు  సమర్పించాలని సంబంధిత అధికారిని ఆదేశించారు.

ఈ సందర్భంగ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)  పథకం  పై గ్రామస్థాయిలో ఉపాధి అవకాశాలను పెంచే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని,జల శక్తి  అభియాన్ జల్ సంచాయి జన్ భాగిదారి లో భాగంగా నీటి సంరక్షణ, నీటి నిలువ, చెక్ డ్యాం, చిన్న ఊట కుంటలు, నీటి నిలువ కందకాలు, రైతుల పొలాలలో సేద్యపు కుంటలు, చెరువుల పునరుద్ధరణ, రోడ్డు మరమ్మత్తులు, టాయిలెట్స్ నిర్మాణం, సి ఆర్ డి వర్క్ యాక్షన్ ప్లాంట్ లో  పశువుల పాక, గొర్ల/ మేకల షెడ్లు, కోళ్ల పాక, అజోలా, వర్మి/ నాడెప్ కంపోస్టు పిట్ మొదలైన పనులు చేపట్టాలని  అధికారులను ఆదేశించారు. పథకం కింద చేపట్టే పనులు స్థానిక అవసరాలకు అనుగుణంగా, శాశ్వత ప్రయోజనాలను అందించేలా ఉండాలని సూచించారు.నూతన అభిరుద్ది  వంటి శాశ్వత ప్రయోజనకర పనులను చేపట్టాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, వృక్షారోపణ, చెరువుల పునరుద్ధరణ, రోడ్డు మరమ్మత్తులు, పంచాయతీ స్థాయిలో గ్రామాల  శుభ్రతా పరిశుబ్రత  కార్యక్రమాలు వంటి సృజనాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్  డా.సత్య శారద సూచించారు.

కార్మికులకు సమయానికి వేతనాలు చెల్లించడంతో పాటు పనుల నాణ్యతను నిర్ధారించాలన్నారు. ప్రతి మండలంలో అమలవుతున్న పనులపై మానిటరింగ్ కమిటీల ద్వారా క్రమం తప్పని సమీక్షలు జరపాలని ఆదేశించారు. 

ఈజీఎస్ పనులలో టాయిలెట్ నిర్మాణానికి ప్రభుత్వ పాఠశాలల లో  అవసరం ఉన్నచోట నిర్మించుటకు ప్రతిపాదనలు పంపించాలని  జిల్లా విధ్యా  శాఖ అధికారి కి పలు సూచనలు చేశారు. జల శక్తి అభియాన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి గ్రామీణ ప్రాంతాలలో “ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ” లలో డ్రైనేజీ వ్యవస్థ మరియు ఇంకుడు గుంతల నిర్మాణం సృజనాత్మకతను ఉపయోగించి  ఏర్పాటు చేయుటకు ఇంజనీరింగ్ అధికారులు కొత్త ధనాన్ని సంతరించేలా గ్రామీణ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు


ఈ కార్యక్రమానికి ఎంపీడీవోలు ఎంపీవోలు హౌసింగ్ ఏఈలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >