| Daily భారత్
Logo




18న బిసి రాష్ట్ర బంద్ కు బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు

News

Posted on 2025-10-16 14:44:01

Share: Share


18న బిసి రాష్ట్ర బంద్ కు బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు

బీడీఎస్ఎఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ( బి డి ఎస్ ఎఫ్ ) జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే మాట్లాడుతూ ఏదైతే ఈనెల 18న బీసీ బంద్ ఉందో దానికి బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బందులో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఏదైతే బీసీలకు రావాల్సిన వాట ఉందో అది ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని అని అన్నారు. 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 18 బిసి రాష్ట్ర బంద్ కు మద్దతుగా ఆయన  మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42% బిసి రిజర్వేషన్ అమలు చేయడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేర్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని బిసి కులాల ప్రజలు బిజెపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు 18 బిసి రాష్ట్ర బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చే భాధ్యత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానిదేనని సంజయ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% బిసి రిజర్వేషన్లను ప్రకటించినప్పుడు అసెంబ్లీలో మద్దతు ప్రకటించిన బిజెపి, బీఆర్ఎస్ పార్టీ లు ఇప్పుడు 9వ జీవో పై హైకోర్టు స్టే ఇవ్వడంతో మాట మార్చి మొత్తం నెపం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బిజెపి,బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నించడం భావ్యం కాదన్నారు. 18 బిసి రాష్ట్ర బంద్ కు ఎస్సీ ఎస్టీ మత మైనారిటీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉదయ్, రాకేష్, నరేందర్, మంగేష్ తదితరులు పాల్గొన్నారు

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >