| Daily భారత్
Logo




వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య

News

Posted on 2025-10-16 08:31:59

Share: Share


వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య

డైలీ భారత్, నాగర్ కర్నూలు:నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం గ్రామంలో ఓ దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను బలితీసుకున్న ఘటన కలకలం రేపుతోంది. హత్యను యాక్సిడెంట్ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, మృతుడి కుటుంబ సభ్యుల అనుమానంతో నిజం వెలుగులోకి వచ్చింది. నాగర్‌ కర్నూల్‌ డీఎస్పీ బి.శ్రీనివాసులు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

జిల్లాలోని శ్రీపురం గ్రామానికి చెందిన రాములు (35) ప్లంబర్​గా పని చేస్తూ, తన భార్య మానస (35) ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగించేవారు. 6 నెలల క్రితం వారి ఇంట్లో బంగారు ఆభరణాల చోరీ జరిగింది. చోరీ చేసినవారు ఎవరో తెలుసుకోవాలని మానస, నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు గ్రామానికి చెందిన మంత్రగాడు సురేష్ గౌడ్ (27) దగ్గరకు వెళ్లారు. అక్కడి నుంచి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధంగా మారింది. ఈ సంబంధంపై భర్త రాములకు అనుమానం వచ్చి భార్యతో తరచూ గొడవలు జరగడం మొదలయ్యాయి. భర్త బ్రతికుంటే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించిన మానస, తన ప్రియుడు సురేష్ గౌడ్​తో కలిసి రాములను హత్య చేయాలని పన్నాగం పన్నింది. తమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని, అతడిని అంతమొందించాలని మానస తన ప్రియుడిని కోరింది.

సురేష్ గౌడ్, రాములును హత్య చేయించేందుకు తన వద్ద పని చేసే బాల్ పీరు, హనుమంతులతో రూ.2.80 లక్షల కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 8వ తేదీన మానస, తన పుట్టింటిలో వివాహం ఉందని చెప్పి వెళ్లింది. ఇదే సమయంలో భర్తను హత్య చేస్తే ఎవరికి అనుమానం రాదని భావించింది. రాములను పెద్ద ముద్దునూరు గ్రామానికి పిలిపించి, సురేష్ గౌడ్, బాల్ పీరు, హనుమంతులు కలిసి అతనికి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న రాములుకు ముక్కు, నోరుపై టేపు అడ్డంగా అంటించి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేసి గాయాలు చేసి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రీకరించారు. ఈ హత్య చేసి తప్పించేందుకు ప్రయత్నం చేశారు

రహదారి పక్కన పడి ఉన్న రాములు మృతదేహాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిని పరిశీలించిన రాములు తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మానస- సురేష్‌ మధ్య అక్రమ సంబంధం ఉందని, కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, మానస ప్రవర్తనపై మృతుడి తల్లిదండ్రులకు అనుమానం ఉండటం వల్ల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది ప్రమాద మృతి కాదని నిర్ధారించారు. రాములు శ్వాస ఆగి మరణించాడని వైద్యులు వెల్లడించారు. పోలీసుల విచారణలో చివరకు మానస, సురేష్ గౌడ్, బాల్ పీరు, హనుమంతులు హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.

"మానస, సురేష్ గౌడ్ వివాహేతర సంబంధం ఉంది. భర్త బ్రతికుంటే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించింది. మానస పుట్టింటిలో వివాహం ఉందని చెప్పి వెళ్లింది. ఇదే సమయంలో భర్తను హత్య చేస్తే ఎవరికి అనుమానం రాదని భావించారు. సురేష్ గౌడ్, బాల్ పీరు, హనుమంతులు కలిసి సురేష్ గౌడ్కు మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న రాములుకు ముక్కు, నోరుపై టేపు అడ్డంగా అంటించి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రికరించారు. పోలీసులు విచారణలో వారు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు."

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >