| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కలెక్టరేట్ లో ప్రజావాణికి విశేష స్పందన... ప్రజావాణికి 143 ఫిర్యాదులు

కలెక్టరేట్ లో ప్రజావాణికి విశేష స్పందన... ప్రజావాణికి 143 ఫిర్యాదులు

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:  ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 143 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను  కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు  విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Previous కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరవేయండి : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
Next రెంజల్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్
ADVERTISEMENT