| Daily భారత్
Logo




మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్

News

Posted on 2025-07-14 08:12:15

Share: Share


మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వయసు పైబడి ఆరోగ్యం సహకరించక పోయిన, మాల జాతి సంక్షేమం కోసం, భారతరత్న అంబేద్కర్  ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న  చెన్నయ్య ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి!

భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్!

మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పివి రావు  తో సహచరుడిగా, వయసు 70 దాటినా, ఆరోగ్యం సహకరించక ఇటీవల స్టంట్ లు వేయించుకున్న,

మాల జాతి సంక్షేమం కోసం, భారతరత్న అంబేద్కర్  ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ,

మార్గదర్శకుడిగా నిలిచిన త్యాగధనుడు  చెన్నయ్య ప్రతి ఒక్క దళితుడు స్ఫూర్తిగా తీసుకోవాలని

భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.

హైదరాబాదులోని  హోటల్లో బస చేసిన, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు  చెన్నయ్య  , ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి,

శాలువాతో ఘనంగా సత్కరించి ,అభినందించారు.

ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల మాట్లాడుతూ

" మాల జాతి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం మన రాష్ట్రంలో దీక్ష కంకణదారులై పార్లమెంటు సభ్యులు  మల్లురవి , తెలంగాణ రాష్ట్ర గనుల శాఖ మాత్యులు చెన్నూరు శాసనసభ్యులు మరియు కార్మిక శాఖ మంత్రివర్యులు గడ్డంవివేక్ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు , ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ , మాల మహానాడు జాతీయ అధ్యక్షుల జి చెన్నయ్య , మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు  ఎర్రోళ్ల రాములు ,   ఎందరో మహానుభావుల త్యాగపూరితమైన సేవలను గమనంలోకి తీసుకుంటూ మాల జాతి ఐక్యత కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, అదేవిధంగా భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లను కలుపుకొని , మన హక్కుల సాధన కోసం కదం తొక్కి ముందుకు సాగాలని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పిలుపునిచ్చారు. తనను సత్కరించి అభినందించినందుకు కృతజ్ఞత లు తెలుపుతూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి .చెన్నయ్య  మాట్లాడుతూ "తన ఆఖరి శ్వాస వరకు, మాల జాతి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం , బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం, మీ అందరి సహకారంతో, ఆ భగవంతుడు ఆశీస్సులతో, నిరంతరం ఉద్యమిస్తానని" హర్షద్వానాల మధ్య ప్రకటించారు. కార్యక్రమంలో  జి చెన్నయ్య ,ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, ఆదర్శ ఫౌండేషన్ అధ్యక్షులు నిరంతర సేవా తత్పరులు  కుసుమ భోగరాజు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు హైకోర్టు అడ్వకేట్ చింతమల్ల సాయిబాబా, కైలాస్ ,తిరుపతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >