Posted on 2025-04-12 10:58:07
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: బంగారం లకారానికి నాలుగంటే నాలుగే అడుగుల దూరంలో ఉంది బంగారం. అది గట్టిగా పరుగులు పెడితే…ఒక్క రోజులో లక్ష రూపాయలను దాటేసేలా ఉంది. గోల్డ్ రేట్లు తగ్గొచ్చని చెప్పిన అంచనాలను తల్లకిందులు చేసి మరీ… పదండి ముందుకు అంటోంది పసిడి.
కొన్నాళ్లుగా నాన్‌స్టాప్ రన్నింగ్ చేసిన పసిడి రేట్లకు ఈమధ్య కాస్తా బ్రేకులు పడ్డాయి. బంగారం ధరలు కొద్దిగా దిగొచ్చాయి. అయితే మళ్లీ ఒక్కసారిగా గోల్డ్ రేట్లు భగ్గుమని ఆల్ టైమ్ హైకి చేరాయి. లక్ష రూపాయలకు చేరువ అయింది బంగారం. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.96,540కి చేరింది.
గత మూడు రోజుల్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ స్పీడ్ చూస్తుంటే లక్షను దాటేలా కనిపిస్తోంది. 2 రోజుల్లోనే 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 6 వేల దాకా పెరిగింది. ఇక వెండి కిలో ధర…రూ.95,500 పలుకుతోంది.
వజ్రాన్ని వజ్రమే కోస్తుందన్నట్లు ఈ బంగారం నిల్వలే…గోల్డ్ రేట్లు తగ్గించవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్న సుంకాల సమరంతో ద్రవ్యోల్బణం విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. అదే గనుక జరిగితే ప్రపంచ దేశాల్లో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.
దానికి అడ్డుకట్ట వేసేందుకు చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఓ ఐదారు వేల టన్నుల గోల్డ్‌ను ప్రపంచ మార్కెట్‌లో అమ్మకానికి పెడితే.. గోల్డ్ రేట్లు ఒక్కసారిగా ఢమాల్‌మనే పరిస్థితి కూడా రావొచ్చనేది విశ్లేషకుల అంచనా. అయితే పరిస్థితులు ఎటు దారితీస్తాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారు నిపుణులు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >