| Daily భారత్
Logo




కొండగట్టు అంజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

News

Posted on 2025-04-12 11:07:56

Share: Share


కొండగట్టు అంజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

- హనుమాన్ జయంతి పర్వదినాన వేల సంఖ్యలో భక్తులు

- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 

డైలీ భారత్, కొండగట్టు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరినకోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు బారీగా తరలివస్తున్నారు. జై శ్రీరామ్ నినాధాలు, జయరామ శ్రీరామ జయజయ రామ నామ స్మరణతో కొండగట్టు మారుమోగుతుంది.‌ మాలాధారణతో పాటు మాలవిరమణ చేసే భక్తులతో కాషాయవర్ణ శోభితంగా తయారైంది కొండగట్టు.

చైత్రమాసం పౌర్ణమి శనివారం రోజున హనుమాన్ జయంతి కావడంతో లక్షకుపైగా హనుమాన్ దీక్ష స్వాములు అజన్న సన్నధికి చేరారు. భక్తుల రద్దీతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.‌ రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఏపి, మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ నేపద్యంలో నిరంతరాయంగా భక్తులకు దర్శన సౌకర్యం కల్పించడంతోపాటు ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చలవ పందిళ్ళు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. కోనేరులో వాటర్ మురికిగా మారడంతో స్నానాలు చేసేందుకు భక్తులు కాస్త ఇబ్బంది పడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే జయంతోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు తలిరావడంతో కొండగట్టు కాషాయవర్ణశోబితంగా మారి రామనామ స్మరణతో మారుమ్రోగుతుంది. హనుమాన్ దీక్షస్వాములతో కొండగట్టు కిటకిటలాడుతుంది.

స్వయంగా కొండగట్టుకు  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేరుకొని అధికారులతో కలిసి సౌకర్యాలు , భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >