Posted on 2025-03-19 16:50:27
మణుగూరు క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం
డైలీ భారత్, మణుగూరు: రోడ్డు ప్రమాదంలో కృష్ణ సాగర్ ఐటిఐ కాలేజీ విద్యార్థి మృతి మరొకరికి తీవ్ర గాయాలు
హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న బూర్గంపాడు ఎస్ఐ రాజేష్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్ రోడ్ రామాపురం దగ్గర లారీ బైక్ను ఢీకొనగా ప్రమాదం.
ఈ ప్రమాదంలో, కృష్ణ సాగర్ ఐటిఐ, కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి చైతన్య మృతి చెందినట్లు సమాచారం, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు గాయాలైన వ్యక్తిని భద్రాచలం ఆస్పత్రికి తరలింపు.
మృతి చెందిన విద్యార్థి ముసలిమడుగు డబల్ బెడ్ రూమ్ దగ్గర ఓ రూమ్ లో ఇద్దరు మిత్రులు కలిసి ఉంటున్నారని సమాచారం.
విషయం తెలుసుకున్న, బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, హుటా హుటినా సంఘటన స్థలానికి చేరుకొని, లారీ కింద ఉన్న బాడీని తీసి భద్రాచలం మార్చురీకి తరలించారు, అనంతరం సంఘటన గురించి అక్కడ ఉన్న కొందరిని వివరాలు అడిగి తెలుసుకుని దర్యాప్తు చేపట్టారు...
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >