| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పేకాట రాయుళ్ల పై కేసు నమోదు చేసిన జూలూరుపాడు బాదావత్ రవి

పేకాట రాయుళ్ల పై కేసు నమోదు చేసిన జూలూరుపాడు బాదావత్ రవి

డైలీ భారత్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా: జూలూరుపాడు మండలం అన్నారపాడు గ్రామంలో సాయంత్రం 4 గంటల సమయంలో అన్నారు పాడు గ్రామంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారంపై జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాధావతు రవి తన సిబ్బందితో కలిసి  మెరుపు దాడి చేసి ఎనిమిది మంది వ్యక్తులు అనగా గుగులోతు భాస్కర్ బాదావత్ బాలాజీ, బానోతు వీరు, గుగులోతు గోపాల్, లావుడియా కిషన్, బాదావత్ బిక్షం, బాదావత్ నవీన్ ,బాదావత్ పటేల్ , వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 5100 రూపాయల నగదు మరియు మూడు ద్విచక్ర వాహనాలను పంచుల సమక్షంలో స్వాధీన పరుచుకొని పేకాట ఆడుతూ పట్టుబడిన సదరు ఎనిమిది మందిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయనైనది. ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే 100 డయల్ చేయండి అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Previous ఢిల్లీ ఎన్నికలో ఐదు గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో
Next ఆశ్రమ గురుకుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
ADVERTISEMENT