| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సర్కిల్ ఇన్స్పెక్టర్ పై క్రిమినల్ దుర్వినియోగం కేసు నమోదు చేసిన ఏసీబీ

సర్కిల్ ఇన్స్పెక్టర్ పై క్రిమినల్ దుర్వినియోగం కేసు నమోదు చేసిన ఏసీబీ

డైలీ భారత్, తొర్రూర్: A Case of Criminal Misconduct has been registered against K. Jagadeesh, Circle Inspector of Police, Thorrur of Mahabubabad District for demanding Bribe of Rs.4,00,000/- from the complainant, to show official favour of not arresting him, to give only notice and to not harass him in a registered case against the complainant. Initially the CI accepted Rs.2,00,000/- and further he demanded for the remaining amount.

నమోదు కాబడిన ఒక కేసులో నిందితునిని అరెస్ట్ చెయకుండా, నోటీసు ఇవ్వడానికి మరియు అతనిపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుని నుండి రూ.4,00,000/- లంచం డిమాండ్ చేసి అందులో మొదటి విడుతగా రూ.2,00,000/- తీసుకొని మిగిలిన నగదును కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు గాను మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్  కె.జగదీష్‌ పై క్రిమినల్ దుర్వినియోగం కేసు నమోదు చేసిన అనిశా.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

జనవరి 6 తొర్రూరు పొలిస్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న  సర్కిల్ ఇన్స్పెక్టర్ కే జగదీష్ రెండు నెలల క్రితం పి డి ఎస్ బియ్యం లారీని పట్టుకొని లారి యజమాని నుండి  5 ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసి 2 లక్షల లంచం తీసుకున్నాడని ఎసిబి అధికారులకు ఇచ్చిన పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి సీ ఐ  కే జగదీష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు ఈ సందర్బంగా ఏసీబీ డి ఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత రెండు నెలల క్రితం పిడిఎస్ బియ్యం లారీని పట్టుకోవడం జరిగిందని, బియ్యం లారీ యజమాని నుండి ఐదు లక్షల రూపాయలను తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కే జగదీష్ డిమాండ్ చేసి 2024 అక్టోబర్ 3 తేదీన 2 లక్షల రూపాయల నగదును తీసుకోవడం జరిగిందని, మిగతా మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని, లారీ యజమాని వేధించగా వరంగల్ లో ఉన్నఏసీబీ స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, పై అధికారుల సూచనల మేరకు తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ పై కేసు నమోదు చేయడం జరిగిందని, డబ్బులు డిమాండ్ చేసినట్లుగా పూర్తి వీడియోలను రికార్డింగ్లను స్వాధీనం చేసుకుని గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారుల ముందు వీడియో రికార్డింగ్లను పూర్తిగా వారి ముందు ప్రవేశపెట్టి సీఐ జగదీష్ ను సోమవారం తొర్రూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ కస్టడీ కి తీసుకోవడం జరిగిందని, ఆయన తెలిపారు. ఇతడిని వరంగల్ ఏసీబీ స్టేషన్ కు తరలించి మంగళవారం ఉదయం ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించనున్నట్లుగా తెలిపారు

Previous భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
Next చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
ADVERTISEMENT