| Daily భారత్
Logo




హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం

News

Posted on 2023-11-11 05:59:04

Share: Share


హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాదులోని  రాజేంద్రనగర్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్ర నగర్‌లోని సన్‌సిటీలోని ఓ బాణసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున మూడు గంటలకు మంటలు చెలరేగడంతో ప్రమాదం తీవ్రంగా మారింది.

అయితే ప్రాణనష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయితే పటాకుల షాపు పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్, పాన్ షాప్, టీ షాపులో మంటలు చెలరేగాయి. ఇవి పూర్తిగా కాలిపోయాయి. అర్థరాత్రి 12 గంటల వరకు క్రాకర్స్ ప్యాక్ చేసి పడుకున్న తరువాత..

రాత్రి 3 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటల వేడి, పొగలు రావడంతో షాపులో ఉన్న వ్యక్తులు మేల్కొని తప్పించుకున్నారు.

అయితే ఈ పటాకుల దుకాణాన్ని టెంట్ హౌస్ గోదాములోని రేకు షెడ్డులో ఏర్పాటు చేశారు. దీంతో టెంట్ హౌస్‌కు చెందిన గోదాము పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

అయితే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది...

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >