| Daily భారత్
Logo




మహిళల ఆర్థికాభివృద్ధికి సెర్ప్ అండగా ఉంటుంది

News

Posted on 2024-09-04 15:29:58

Share: Share


మహిళల ఆర్థికాభివృద్ధికి సెర్ప్ అండగా ఉంటుంది

సెర్ప్ సీఈవో దివ్య దేవ రాజన్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి సెర్ప్ అండగా ఉంటుందని సేర్ప్ సీఈవో  దివ్య దేవరాజన్ అన్నారు. బుదవారం కొత్తూరు మండలంలోని ఇన్ముల్ నర్వ గ్రామాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా గ్రామంలో గల మట్టి పాత్రల తయారీ యూనిట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మట్టి పాత్రల తయారు చేసే సభ్యులతో కలిసి మట్టి పాత్రల తయారు చేసే విధానం, మార్కెటింగ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి  దగ్గరగా  జెపి దర్గా సందర్శక స్థలం ఉందని, అక్కడికి రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు వస్తారన్నారు. మహిళా సంఘం సభ్యులు తయారుచేసిన మట్టి పాత్రలను అమ్మడం జరుగుతుందని ఆమెకు తెలిపారు. హైద్రాబాద్ మరియు ఇతర ప్రదేశాలలో మట్టి పాత్రల వ్యాపారం చేసుకొనే వ్యాపారస్తులకు అడర్స్ పైన ఎగుమతి చేస్తామన్నారు. ఈ సంధర్బంగా సిఈఓ  మాట్లడుతూ ఈ మట్టి పాత్రలు తయారు చేసే విధానములో కొత్త టెక్నాలజీని వాడే క్రమంలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక గ్రూపుల్లో  ఉన్న సభ్యుల కుల వృత్తులకు బిఎల్, ఎస్ఎన్, సీఐఎఫ్, విఓ సంస్థల నుండి ఋణాల రూపంలో ఆర్థిక సహాయానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, రాష్ట్రస్థాయి సర్ప్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కొత్తగా ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం ద్వారా సభ్యులకు కొత్త వ్యాపారాలు, పాడి పశువులు, నాటుకోళ్లు పెంపకం, మిల్క్ ప్రోడక్ట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఇతర వ్యాపారాలకు కావలసిన నైపుణ్య శిక్షణతో పాటు రుణ రూపంలో ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూర్ మండల సమాఖ్య ఎపిఎం కొండయ్య, సిసిలు  రాజప్ప, ఖలీల్, లక్ష్మమ్మ, అలివేలు, వీఓఎ లు, గ్రామ సంఘం సభ్యులు పాల్గొన్నారు..

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >