| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇవాళ కవితకి బెయిల్ రావడం బిఆర్ఎస్ బీజేపీ లో విలీనమా.?

ఇవాళ కవితకి బెయిల్ రావడం బిఆర్ఎస్ బీజేపీ లో విలీనమా.?

వచ్చే ఎన్నికల్లో బీజేపీ..బిఆర్ఎస్ పోత్తా..? ఇదే కేసీఆర్..మోడీకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్

బిఆర్ఎస్....బీజేపీ లోపాయికారీ ఒప్పందంలో భాగమే కవితకు బెయిల్

వచ్చే ఎన్నికల్లో బీజేపీ..బిఆర్ఎస్ పోత్తా..? ఇదే కేసీఆర్..మోడీకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్

కవిత లిక్కర్ మాఫియా కింగ్ కి ఐదు నెలలకే బెయిల్

17 నెలల వరకు సిసోడియా కి బెయిల్ రాలేదు..ఐదు నెలలకే కవితకి బెయిల్ ఎలా వచ్చింది

తెలంగాణ లో కాంగ్రెస్ నీ దెబ్బతీసే కుట్రలో బీజేపీ..బిఆర్ఎస్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:బీఆర్ఎస్ ఎంఎల్సి కవితకు బెయిల్ పై మీడియా సమావేశం లో పాల్గొన్న సంగారెడ్డి మాజీ ఎంఎల్ఏ జగ్గారెడ్డి.జడ్జి బెయిల్ ఆర్థర్ ఇవ్వకముందే.. మూడు రోజులుగా కేటీఆర్...బిఆర్ఎస్ సోషల్ మీడియా హడావుడి.బిఆర్ఎస్...బీజేపీ వచ్చే ఎన్నికల లోపు విలీనం కావచ్చు లేదంటే పొత్తు పెట్టుకోవచ్చు.బెయిల్ వస్తుంది అని ముందే చెప్పిన కేటీఆర్ పైనే కోర్టు చర్యలు తీసుకోవాలి.బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి చెప్పే వరకు తెలియదు.కానీ కవిత బెయిల్ పై మూడు నాలుగు రోజుల నుండి కవితకు బెయిల్ వస్తుందని బిఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం.కేటీఆర్ రెండు రోజుల ముందే డిల్లీలో హడావుడి  చేశారు.జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ బిఆర్ఎస్ చెప్పేస్తుంది.బీజేపీ ప్రభుత్వం..బిఆర్ఎస్ కి ఒప్పందాల్లో భాగంగానే బెయిల్ 

జడ్జి చెప్పకముందే.. కేసీఆర్..కేటీఆర్..హరీష్ లకు ముందు సమాచారం వచ్చింది 

దేశంలో విచిత్ర పరిపాలన జరుగుతుంది 

బీజేపీ కి..తెలంగాణ లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు .అందుకే..బీజేపీ.. బిఆర్ఎస్ కలిసి పోయే దాంట్లో భాగమే లిక్కర్ కేసు .బీజేపీ వ్యూహం ఏంటంటే... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి..బిఆర్ఎస్ నీ కలుపుకునే పనిలో ఉంది 

పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించింది 

కవిత బెయిల్ కండిషన్ లో భాగమే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి ఓట్లు వేయించారు.మెదక్ లో బిఆర్ఎస్ గెలుస్తది అనే పరిస్థితి లో మూడో స్థానం కి ఎందుకు పోయింది 

కవిత కోసం సొంత పార్లమెంట్ నియోజక వర్గం కేసీఆర్ వదిలేసుకున్నారు.మాకు నాలుగు సీట్లు తగ్గడానికి బీజేపీ..బిఆర్ఎస్ కలిసి పోవడమే కారణం.రాజకీయంగా కాంగ్రెస్ నీ బలహీన పరిచే ఒప్పందం లో భాగమే బీజేపీ..బిఆర్ఎస్ ఎత్తుగడ.బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుందనే ప్రచారం చేసి... .వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నయి.కవిత బెయిల్ రావడం బిఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం లో భాగమే .సిసోడియా.. కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వడానికి ఆలోచించిన కోర్టులు.కవిత కి ఐదు నెలల్లో బెయిల్ ఎలా వచ్చింది.బీజేపీ గెలిచిన పార్లమెంటు నియోజక వర్గాల్లో.. రేపు ఎన్నికలు అనగా బిఆర్ఎస్ అజెంట్ లు.. ఎంఎల్ఏ లు కూడా లేరు.బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కూడా.. కాంగ్రెస్ కి వేయకండి... బీజేపీ కి వేయండి అని ప్రచారం చేశారు.బీజేపీ ఉత్తరాదిన వీక్ అయ్యింది..దక్షిణాది లో బిఆర్ఎస్ నీ బలహీన పరిచారు.ఏపీ లో చంద్రబాబు... పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొని సీట్లు గెలిచింది.బిఆర్ఎస్ ఓ పావుగా బీజేపీ కి పని చేస్తుంది.బిఆర్ఎస్ కి మంచి రోజులు బీజేపీ వల్ల వచ్చింది.మేము జడ్జిని తప్పు పట్టడం లేదు.. జడ్జి చెప్పక ముందే బిఆర్ఎస్ చెప్పు కుంది అనేది మా వాదన.న్యాయవ్యవస్థ కేసీఆర్ కుటుంబం పై చర్యలు తీసుకోవాలి మూడు రోజుల ముందే బెయిల్ వస్తుంది అని హడావుడి చేసినందుకు

Previous మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు
Next భారత దేశంలో తొలిసారి మెదడులో ఏర్పడిన కణితిని కంటి సాకెట్ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించిన ఎఐజి వైద్యులు
ADVERTISEMENT