| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కవిత బెయిల్ పట్ల హర్షం వ్యక్తం చేసిన షాద్ నగర్ బిఆర్ఎస్ శ్రేణులు.

కవిత బెయిల్ పట్ల హర్షం వ్యక్తం చేసిన షాద్ నగర్ బిఆర్ఎస్ శ్రేణులు.

ప్రజాస్వామ్య దేశంలో న్యాయమే గెలిచింది

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేయడం పట్ల హర్షం షాద్నగర్ బిఆర్ఎస్ శ్రేణులు. షాద్ నగర్ పట్టణంలో టపాకులు కాల్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. దాదాపుగా 166 రోజుల నుండి తీహార్ జైల్లో ఆధారాలు లేని కేసు విషయంలో జైలు జీవితాన్ని గడపడం జరిగిందని ఈ కేసును కేవలం కక్షపూరితంగానే ఆమెను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేయాలని బిజెపి ప్రభుత్వం ఆమెపై కక్షపూరితంగా ఈ కేసును ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను వాడుకొని ఆమెకు ఇబ్బందులను గురి చేయడం జరిగిందన్నారు. కానీ ఈరోజు  భారతదేశ అత్యున్నత న్యాయస్థానం  న్యాయబద్ధమైన తీర్పును వెలువరిస్తూ బెయిల్ మంజూరు చేయడం జరిగిందన్నారు. కల్వకుంట్ల కవితకు  సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల  ఆనందం వ్యక్తం చేస్తూ, అక్రమ కేసులు పెట్టి తెలంగాణ ఆడబిడ్డను ఇబ్బందులకు గురి చేయడం జరిగిందనీ, రాబోయే రోజుల్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.

Previous ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు అక్రమం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
Next తూప్రాన్ మున్సిపల్ పరిధిలో అధికంగా పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలి
ADVERTISEMENT