| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట ... మద్యం కేసులో బెయిల్ మంజూరు

ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట ... మద్యం కేసులో బెయిల్ మంజూరు

డైలీ భారత్, న్యూఢిల్లీ: బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆమెకు దాదాపు 5 నెలల అనంతరం బెయిల్ దొరికింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బెయిల్​ మంజూరు చేసింది.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ఆమె బెయిల్ పిటిషన్​పై విచారించిన జస్టిస్ బీఆర్​ గవాయి, జస్టిస్ విశ్వనాథన్​ ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని, ఒక మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని తెలిపారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికీ వెళ్లరని చెప్పారు. రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న ముకుల్‌ రోహత్గి, కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదన్నారు. ఇదే కేసులో మనీశ్‌ సిసోదియాకు బెయిల్ మంజూరైందని, సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనానికి వివరించారు.

అనంతరం ఈడీ తరఫున వాదనలు వినిపించిన ఏఎస్‌జీ, ఎమ్మెల్సీ కవిత తరచూ ఫోన్లు మార్చారని, ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించారని కోర్టుకు తెలిపారు. ఫార్మాట్ చేసిన ఫోన్లను ఇంట్లో పని మనుషులకు ఇచ్చారని తెలిపారు. ఫోన్‌లోని సందేశాలను తొలగిస్తే తప్పేంటని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశ్నించగా, మెసేజ్‌లను కాదు, పూర్తిగా డేటాను ఫార్మాట్‌ చేశారని, సెల్‌ఫోన్‌ డేటాను పూర్తిగా ఫార్మాట్‌ చేయడం అసాధారణమని వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం, కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


#mlc kavitha #liquor scam

Previous CPS రూపాంతరమే UPS
Next యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
ADVERTISEMENT