Posted on 2023-11-02 16:33:28
డైలీ భారత్, నిర్మల్ జిల్లా: తెలంగాణ లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ ఆయా నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ సభల్లో పాల్గొంటు వరాల జల్లు కురిపిస్తున్నారు.
దీంట్లో భాగంగా గురువారం నిర్మల్ జిల్లాలో ప్రజా ఆశ్వీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ వచ్చాక ఎన్నో జిల్లాలుగా ఏర్పాటు చేసుకుని అభివద్ధిని సులభతరం చేసుకుంటున్నామని..ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో అయన కోరిక మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా ఏర్పాటైందని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్మల్ జిల్లా అభివద్ధిలో దూసుకుపోతోందని అటువంటి నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా ఏర్పడం వల్లే అభివృద్ధి జరుగుతోందని ఈ ఘనత అంతా ఇంద్రకరణ్ రెడ్డిదేనని..మరోసారి ఆయన్ని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ చెప్పాడంటే శిలాశాసనమే, ఆరు నూరైనా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే : సీఎం కేసీఆర్
ఎన్నికల వేళ ఎన్నో పార్టీలు వస్తాయి. ఓట్లు అడగుతాయి. కానీ ఏ పార్టీ ఎటువంటిదో.. ఏ అభ్యర్థి ఎలాంటివాడో తెలుసుకుని ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
ఓటు అనేది ప్రతీ వ్యక్తి చేతిలో ఉండే వజ్రాయుధం అని ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టి అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఈరోజు ఎన్నడూ ఊహించని విధంగా నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు.
రాష్ట్రాన్ని శాంతి యుతంగా ముందుకు తీసుకెళుతున్నామని గిరిజన జిల్లాగా పేరొంది..అభివద్ధికి నోచుకోని జిల్లాను రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకున్నామని..నిర్మల్ ఈరోజున ఇలా ఉందంటే ఇంద్రకరణ్ రెడ్డి వల్లేనన్నారు. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ జిల్లా మరింతగా అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఇలా మరింతగా మీ ఆశలకు..ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని హామీ ఇఛ్చారు.
ప్రలోభాలకు లొంగిపోకుండా కత్తులతో దాడులకు పాల్పడే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పే బీజేపీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కెసిఆర్ కోరారు...
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >
ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-08-15 07:33:17
Readmore >
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >