| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్విమ్మింగ్ పోటీలలో సత్తా చాటిన చొప్పదండి శ్రీనివాస్

స్విమ్మింగ్ పోటీలలో సత్తా చాటిన చొప్పదండి శ్రీనివాస్

జాతీయస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ లో ప్రథమ ద్వితీయ బహుమతులు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: హైదరాబాదులో మే 22,23 తేదీలలో జాతీయస్థాయి మాస్టర్స్ గేమ్స్ ఛాంపియన్షిప్ పోటీలు సికింద్రాబాద్ లోని బి.వి గురుమూర్తి స్విమ్మింగ్ పూల్ లో జరిగాయి. బుధ గురు వారాలలో జరిగిన ఫెడరేషన్ కప్ 50 ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ పోటీలలో సిరిసిల్లకు చెందిన చొప్పదండి శ్రీనివాస్ 50 ఏజ్ కేటగిరి మెన్ విభాగంలో 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ప్రథమ బహుమతి,100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ద్వితీయ బహుమతి,50 మీటర్ల బ్యాట్ స్ట్రోక్ పోటీలలో ద్వితీయ బహుమతి సాధించి సత్తా చాటాడు. జాతీయస్థాయి ఫెడరేషన్ మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీలలో పాల్గొనటానికి వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. చొప్పదండి శ్రీనివాస్ ప్రథమ ద్వితీయ బహుమతులను సొంతం చేసుకుని 50 ఏజ్ లో కూడా సత్తా చాటడం పట్ల బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ , సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడెపు రవీందర్, బిజెపి నాయకులు పత్తిపాక సురేష్, గారి పెళ్లి ప్రభాకర్, రెడ్డబోయిన గోపి, భాస్కర్, అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు

Previous తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేసిన వ్యక్తులను గుర్తించిన పోలీసులు
Next కాంట్రాక్టు , ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జితల్లేవ్ !
ADVERTISEMENT