జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళావతి బాయి కి వినతి
రాష్ట్ర ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎల్ కరుణాకర్ హాజరు
డైలీ భారత్, మహబూబాబాద్: మానుకోట జిల్లా మెడికల్ విభాగంలో పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం కాంట్రాక్టు అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెండు నెలల జీతం రాని కారణంగా మహబూబాబాద్ జిల్లా నుండి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరూ శుక్రవారం హైదరాబాద్ కోటి, సుల్తానాబాద్ హెల్త్ ఆఫ్ డైరెక్టర్ నందు జరిగే ఏఐటీయూసీ సమ్మెకు మద్దతు తెలుపుతూ మహబూబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళావతి బాయి కి వినతి పత్రం అందించడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ లో 78 క్యాడర్లలో పనిచేస్తున్న 17,514 మంది ఉద్యోగులు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో గత అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగులు నిత్యం కిందిస్థాయి ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ అనేక ప్రాంతాల నుండి విధులకు హాజరవుతుంటారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ పేద, మధ్యతరగతి కి చెందినవారై ఉంటారు. ప్రతినెల 1వ తేదీన జీతం అందితే తప్ప వారి కుటుంబాలు నడిచే పరిస్థితి ఉండదు. గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సక్రమంగా వచ్చే బిల్లు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు ఎన్ హెచ్ ఎం లకు బడ్జెట్ కేటాయింపులు జాప్యం జరుగుతున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల్లో ఇంత ఇబ్బందికర వాతావరణ ఏర్పడింది. గత మార్చి, ఏప్రిల్ మరియు మే మూడు నెలల వేతనాలు అందకపోవడంలో కార్మికుల పరిస్థితి దయానంగా మారింది. ఇంటికి రాయిలు, పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ విషయంలో అనేక సందర్భాలలో జిల్లాస్థాయి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ నేటి వరకు కూడా జీతాలు అందలేదు. ఈరోజు అనగా మే 23 నెలలో ఒకటవ తేదీన అందాల్సిన జీతాలు ఈరోజు దాకా అందకుంటే మా పరిస్థితి ఏంటి కావున శుక్రవారం రోజు ఏఐసీయూటీ నిర్వహించే నిరసనకి మా మద్దతు ఉంటుంది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎల్ కరుణాకర్, తెలంగాణ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుక్ముద్దీన్, కార్యవర్గ సభ్యులు సంజీవ్ నాయక్, రఘునాథ్ పాల్గొనడం జరిగింది.