| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ముఖ్యమంత్రి హోదాలో పచ్చి అబద్ధాలు.. రేవంత్ రెడ్డి పై ఎమ్మార్పీఎస్ ధ్వజం

ముఖ్యమంత్రి హోదాలో పచ్చి అబద్ధాలు.. రేవంత్ రెడ్డి పై ఎమ్మార్పీఎస్ ధ్వజం

డైలీ భారత్, మాసాయిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సామాజిక పరివర్తకులు మందకృష్ణ మాదిగ పై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా నాయకత్వం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, మంద కృష్ణ మాదిగ ని కేసిఆర్ జైల్లో పెట్టినప్పుడు తానే అండగా ఉన్నాననడం సరైంది కాదన్నారు. కూతురు వివాహం ముందు రేవంత్ రెడ్డి ని కేసిఆర్ జైలులో పెట్టినప్పుడు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అండగా నిలిచిన విషయం మరిచిపోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణచేసి తీరుతామని ముఖ్యమంత్రి అనడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు.గతంలో వర్గీకరణ చేసే అవకాశం, అధికారం ఉండికూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు పార్లమెంటు స్థానాల్లో ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించక మాదిగలను మోసం చేసిందన్నారు. మాదిగలకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చు కోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంద కృష్ణ మాదిగ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా ఖండిస్తు న్నా మన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని గ్రహించిన మాదిగలు ఆపార్టీకి దూరం అవుతుండడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉలిక్కిపడి పచ్చి అబద్ధాల ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ, మాదిగ జర్నలిస్టుల ఫోరం సీనియర్ నాయకులు చంది శ్రీనివాస్ మాదిగ, సీనియర్ నాయకులు సర్గల పర్శరాములు మాదిగ, మాదిగ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల పుష్ప మాదిగ, శంకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Previous ఎన్నికల సజావుగా నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
Next మళ్లీ పుంజుకున్న బి ఆర్ఎస్ ప్రభుత్వం
ADVERTISEMENT