| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

2 కోట్లు విలువగల గంజాయి ద్వoసం

2 కోట్లు విలువగల గంజాయి ద్వoసం

డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆదేశాల మేరకు ఎస్ పి  ఆధ్వర్యంలో గంజాయి ద్వoసం

డైలీ భారత్, ములుగు జిల్లా:  రోజు రోజుకు పెరిగి పోతున్న గంజాయి విక్రయాన్ని అడ్డుకట్ట  వేసే దిశగా ములుగు జిల్లాలో  ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు. డ్రగ్ డీస్-పోసల్ కమిటీ ఆదేశాల ప్రకారం ములుగు పస్రా ఏటూర్ నాగారం మంగపేట వెంకటాపురం  పరిధిలో సీజ్ చేసినటువంటి 757 కిలోల 625 గ్రాముల  గంజాయిని గురువారం జిల్లా ఎస్పీ  గాష్ ఆలం ఐ పి ఎస్ ఓ ఎస్ డి అశోక్ కుమార్ ఐ పి ఎస్ ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్ ఐ పి ఎస్  ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ధ్వంసం చేయనైనది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ  కొందరు అక్రమార్జన లో భాగంగా గంజాయిని విక్రాయిస్తూ  పట్టణ మరియు గ్రామాలలోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ గంజాయి మత్తులోకి దించుతున్నందున వారిని అరికట్టడం కోసం జిల్లాలోని పోలీస్ అధికారులచే ఒక రహస్య బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు.  ఎవరైనా గంజాయి గానీ ఇతర మత్తు పదార్థాలు గానీ విక్రయిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ  హెచ్చరించారు.  తమ పరిసరాలలో గంజాయిని విక్రయిస్తున్నట్టు అనుమానా స్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం అందించి వారి పిల్లల బంగారు భవిష్యత్తు కాపాడు కోవాల్సిందిగా ఎస్ పి  కోరారు .ఈ కార్యక్రమంలో డ్రగ్ డీస్ పోసల్ కమిటీ సభ్యులు (4సభ్యులు )ఎస్ పి గౌష్ ఆలం ఐ పి ఎస్ , ఓ ఎస్ డి అశోక్ కుమార్ ఐ పి ఎస్ , ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్ ఐ పి ఎస్,  సి సి ఎస్ మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ దయాకర్ లు మరియు రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ సతీష్, ఆర్ ఐ వెంకటనారాయణ ఎస్ ఐ కమలాకర్ పాల్గొన్నారు.

Previous మీ ఆశీర్వాద బలమే.. రేపటి నా గెలుపునకు శ్రీ రామరక్ష! ఎమ్మెల్యే అభ్యర్థి‌ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ
Next గవర్నరు అంటే రబ్బర్ స్టాంపా : తమిళ్ సై
ADVERTISEMENT