డైలీ భారత్, హైదరాబాద్:మహిళా, శిశు, దివ్యాం గులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అంగన్వా డీల్లో పౌష్టికాహారం దుర్వి నియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు.అద్దె భవనాల్లో కొనసాగు తున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మా ణాలపై దృష్టిసారించా లన్నారు.
మొదటి ప్రాధాన్య తగా తీసుకుని భవన నిర్మా ణాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు.
ఈ సమావేశానికి మంత్రి సీతక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత శాఖ అధి కారులు హాజరయ్యారు.