| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేంద్ర సాహిత్య అకాడమీ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ కు డాక్టర్ పత్తిపాక మోహన్

కేంద్ర సాహిత్య అకాడమీ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ కు డాక్టర్ పత్తిపాక మోహన్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ కవి, బాల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాకమోహన్ కు కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరగనున్న ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ కు అదితిగా ఆహ్వానం అందింది. మార్చ్ 11 నుండి 16 వరకు ఢిల్లీలో జరిగే ఉత్సవాలలో 200 భాషల నుండి ప్రముఖ సాహితీవేత్తలు హాజరు కానున్నారు. 14వ తేదీన భారతీయ భాషల్లో బాల సాహిత్య సదస్సు లో తెలుగు దక్షిణ భారత భాషల బాల సాహిత్యం పై డాక్టర్ పత్తిపాక మోహన్ మాట్లాడనున్నారు. మోహన్ తో పాటు మరో ఐదుగురు సదస్సులో బాల సాహిత్యం పై ప్రసంగించానున్నారు. ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ సదస్సులు పాల్గొంటున్న మోహన్ కు మారసం అధ్యక్షులు టి.వి. నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్, ఎలగొండ రవి, పరుశరాములు, అశోక్ వెంగళ లక్ష్మణ్, జిందం అశోక్, దేవానందం, అనిత, సౌమ్య, వంశీ ,రమేష్ అభినందనలు తెలిపారు.

Previous బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి శ్రీపాదరావు ఎనలేని కృషి :షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next అంగన్వాడి కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సీఎం సమీక్ష సమావేశం
ADVERTISEMENT