| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి శ్రీపాదరావు ఎనలేని కృషి :షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి శ్రీపాదరావు ఎనలేని కృషి :షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

అసెంబ్లీ ప్రాంగణంలో శ్రీపాదరావు జయంతి వేడుకలు 

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి దివంగత స్పీకర్ శ్రీపాదరావు ఎనలేని కృషి చేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసాచార్యులు, చీఫ్ విప్ బీర్ల ఐలయ్య వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ దివంగత శ్రీపాదరావు జయంతి అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి అసెంబ్లీ స్పీకర్ స్థాయి వరకు శ్రీపాదరావు ఎదిగారని కొనియాడారు..

Previous విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి
Next కేంద్ర సాహిత్య అకాడమీ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ కు డాక్టర్ పత్తిపాక మోహన్
ADVERTISEMENT