డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జక్కిడి శివచరణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎల్. బి నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లో స్పందన బాలాజీ పాపయ్య పరమేశ్వర్ ఉచిత వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు మరియు బ్లడ్ ప్యాకెట్లు పంపిణీ చేసి...
అనంతరం మన్సూరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్స్ మరియు పదవ తరగతి పరీక్షకు సంబంధించిన పరీక్ష కిట్లను అందించారు...అనంతరం ఒకటవ తరగతి విద్యార్థుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆలూరి పుల్లయ్య, రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గంట శ్రవణ్,సీనియర్ నాయకులు పృధ్విరాజ్,బోనం రఘుపతి స్వామి గౌడ్, విటల్ రెడ్డి,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు