| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పల్స్ పోలియో ర్యాలీ ప్రారంభించిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి

పల్స్ పోలియో ర్యాలీ ప్రారంభించిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి

పల్స్ పోలియో విజయవంతం చేయండి.

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో: అప్పుడే పుట్టిన పాప నుండి 5సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు డిప్యూటీ డిఎం ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి ప్రారంభించారు.పల్స్ పోలియో దినోత్సవం పై ప్రభుత్వ అస్పత్రి వారి ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి పల్స్ పోలియో ర్యాలీని డిప్యూటీ డిఎం ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ,,,పల్స్ పోలియో కార్యక్రమం ఉన్నందువలన ప్రతి ఒక్కరూ పుట్టినప్పటి నుండి 5 సంవత్సరముల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసి,పోలియో వ్యాధి రాకుండా నివారించాలని తెలియజేశారు.పల్స్ పోలియో కార్యక్రమము రేపు ఉదయము ఏర్పాటు చేసిన అన్ని బూతులలో  7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడును అని డాక్టర్ వి.విజయలక్ష్మి తెలియజేశారు.పల్స్ పోలియో కార్యక్రమము ఏర్పాటు చేసిన బూతులలోనే,కాకుండా బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ లో మరియు గుడిసెలలో,ఇటిక బట్టీల దగ్గర కూడా మొబైల్ వెహికిల్  ద్వారా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలియజేశారు.సోమవారము మరియు మంగళవారము ఇంటింటి సర్వే ద్వారా,సర్వే చేసి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, పి.పి యూనిట్ ఏ.ఎన్.ఎమ్. స్వప్న, గౌస్ ఖాన్ , రమేష్ మరియు ఆశలు పాల్గొన్నారు.

Previous టీఎస్ ఆర్టీసీకి జాతీయస్థాయి పురస్కారాలు
Next వృద్ధులకు పండ్లు, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేసిన జక్కిడి శివ చరణ్ రెడ్డి
ADVERTISEMENT