| Daily భారత్
Logo




ఎవరికి వారే లాబీయింగ్...! బీజేపీ ఎంపీ టికెట్ రేసులో ఆ ముగ్గురు

News

Posted on 2024-02-25 13:08:46

Share: Share


ఎవరికి వారే లాబీయింగ్...! బీజేపీ ఎంపీ టికెట్ రేసులో ఆ ముగ్గురు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ పాలమూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసే బీజేపీ అభ్యర్థిగా ఎవరు అనే అంశంపై ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రసవత్తర చర్చలకు తెరలేపుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి పేరు ఇప్పటికే ఖరారు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి బీజేపీపై పడింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు రంగంలో ఉండనున్నారనే అంశం కన్నా అభ్యర్థి పైననే చర్చలు ఎక్కువగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకుని ఎన్నికల పోరులో నిలవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంత‌కుమార్ ఆశిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలతో ఉన్న పరిచయాలతో టిక్కెట్ సాధించుకోవాలని ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు.

ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు..

ప్రజలకు చేరువ అయ్యేందుకు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంత కుమార్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. రెండు నెలలుగా ఆయా నియోజకవర్గాలలో పర్యటనలు చేసి పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడంతో పాటు.. పలు కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రారంభించిన బస్సుయాత్రలో ముగ్గురూ పాల్గొంటున్నారు

అంచనాకు రాని శ్రేణులు..

టికెట్ ఎవరికి వస్తుందనే అంశంలో పార్టీ శ్రేణులు అంచనాకు రాలేకపోతున్నారు. గతంలో శాంత‌కుమార్ పలు సందర్భాలలో టిక్కెట్‌ను త్యాగం చేసిన నేపథ్యంలో ఈసారి ఆయనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. డీకే అరుణ గత పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించింది. ఈసారి ఎన్నికల్లో తనకు గెలిచే అవకాశాలుంటాయని గట్టిగా చెబుతున్నారు.

ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి మాత్రం ఎన్నికలలో టికెట్ తనకు వచ్చే ఎన్నికల్లో ఇవ్వాలన్న ఒప్పందంతోనే చేరిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తన కుమారుడిని పోటీలో ఉంచానని, ఇప్పుడు తనకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశం అధిష్టానానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, అభ్యర్థి ఎవరనే అనే అంశం తేలడానికి మరో వారం, పది రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >