| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాలేశ్వరం నీళ్లు... నాచారం చెక్ డ్యాం నిండి పొర్లుతున్నాయి

కాలేశ్వరం నీళ్లు... నాచారం చెక్ డ్యాం నిండి పొర్లుతున్నాయి

డైలీ భారత్, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి తమ నియోజకవర్గంలో  నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని దీనివలన రైతులు ఇబ్బంది పడుతున్నారని స్పీకర్ తో మనవి  చేశారు. వెంటనే నీటిని విడుదల చేసి  మా నియోజకవర్గ రైతులకి సహాయం అందించాలని ఆమె పేర్కొన్నారు. రైతుల ఆవేదన గమనించి వెంటనే  నీటిని వదిలారు. దీంతో నాచారం చెక్ డ్యాములు పొంగి పొర్లాయి దీంతో అక్కడ రైతులు హర్షం వ్యక్తం చేశారు.

అదేవిధంగా రేపటి గురువారం సాయంత్రానికి నర్సాపూర్ నియోజకవర్గ మాసాయిపేట మండలం కొప్పులపల్లి హల్దీ ప్రాజెక్టుకు చేరుకుంటాయని రైతులు తెలిపారు. 


అనంతరం రైతుల పక్షాన నీరు వదలాలి అని సభలో మాట్లాడిన వాకిట సునీత లక్ష్మారెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Previous దేశానికి నరేంద్ర మోడీ కరెక్ట్
Next వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్
ADVERTISEMENT