| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం

కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం

ముఖ్య అతిథి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి

కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున వివిధ పార్టీల నాయకులకు కండువాలు కప్పి ఆహ్వానించిన రాజిరెడ్డి

డైలీ భారత్, మాసాయిపేట:మాసాయిపేట మండలం కేంద్రంలో సుమధుర వెంచర్లు లో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మాసాయిపేట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆవుల రాజిరెడ్డి తెలిపారు అనంతరం బుధవారం నాడు మాసాయిపేట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరు అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలను ప్రతి కార్యకర్తతో చర్చించామని రాజిరెడ్డి పేర్కొన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ఎస్ పార్టీ విడిచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని అన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలతో సమన్వయంతో పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు సాగుతామని అభివృద్ధి ఎలా చేయాలి ఆరు అంశాలను కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ప్రజలు ఆహ్వానిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు మాసాయిపేట మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి చుట్టుపక్కల గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరైనట్లు అదే విధంగా భారీ ఎత్తున చేరికలు జరిగినాయి అని అన్నారు.


ఈ కార్యక్రమంలో మాసాయిపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాసాయిపేట జంగిటి భూస్వామి అధ్యక్షులు, మాజీ ఉపసర్పంచ్ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ముక్కాదశరథ, కాంగ్రెస్ యువసేన, కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల అధ్యక్షులు కార్య కర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు

Previous సింగూరు నీటి విడుదలతో మంజీరా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :జిల్లా ఎస్.పి డా. బి.బాలస్వామి
Next దేశానికి నరేంద్ర మోడీ కరెక్ట్
ADVERTISEMENT