| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సింగూరు నీటి విడుదలతో మంజీరా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :జిల్లా ఎస్.పి డా. బి.బాలస్వామి

సింగూరు నీటి విడుదలతో మంజీరా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :జిల్లా ఎస్.పి డా. బి.బాలస్వామి

డైలీ భారత్, మెదక్:మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి  మాట్లాడుతూ... సింగూరు నీటి విడుదలతో  సింగూరు నుంచి ఏడుపాయల మీదుగా మెదక్ జిల్లాకు వచ్చే వరద నీటిని విడుదల చేయడంతో ఈ ప్రాంత ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు శాఖ అవసరమైన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని  ప్రస్తుతం నీరు సింగూరు నుంచి నీటిని విడుదల చేస్తున్నందున ఏడుపాయలలో నీటి ప్రవాహం వస్తున్నందున మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి ఉదృతి ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతానికి ప్రజలు రాకుండా అవసరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని మంజీరా పరివాహక ప్రదేశాల్లో ఉన్న రైతులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... మంజీరా నది పరివాహ ప్రాంతాల్లో ఉండే పశువుల కాపరులు గొర్రెల కాపరులు తగు జాగ్రత్తలు పాటించాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజల యోగక్షేమాల కోసం ఎల్లప్పుడూ పోలీస్ శాఖ పని చేస్తోందని తెలిపారు. తమ తమ పోలీస్ స్టేషన్ ల పరిదిలలో డ్యామ్ లు, చెరువులు, కుంటలు, అలుగులు పారే ప్రదేశాలను గుర్తించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడి  పరిస్థితుల  పై అధికారులకు తెలియజేయాలని విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 100 కానీ దగ్గర లోని పోలీస్ స్టేషన్ కి కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ 8712657888 కి సమాచారం ఇవ్వాలని అన్నారు.

Previous మెదక్ లో 17 దుకాణాల వేలం పాట
Next కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం
ADVERTISEMENT