రాజకీయాలకతీతంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలి
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ హామీలన్నింటిని నెరవేరుస్తాం
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రాజకీయాలకతీతంగా పనిచేసే నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేద్దామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై మాట్లాడుతూ..గ్రామాల్లో ఉండే సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులు గ్రామాల్లోని మిషన్ భగీరథ, విద్యుత్, రోడ్లు తదితర సమస్యలను లేవనెత్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్నది వేసవి కాలం అని దాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటిని అందించడానికి కృషి చేయాలన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ మండలం కి మిషన్ భగీరథ పై తాను అధికారులతో సంప్రదించి పనులు పూర్తి చేయించామని చెప్పారు .రెండు మూడు రోజులుగా మున్సిపాలిటీలో మిషన్ భగీరథ నీరు వస్తుందని అన్నారు. పది రోజుల్లో కొత్తూరు మండలంలోని అన్ని గ్రామాలకు నీటి సమస్య తీరనుందని చెప్పారు. అలాగే గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. ఏవైనా స్తంభాలు పాతబడిపోతే వాటి స్థానంలో కొత్త స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన ప్రజాప్రతినిధులకు సూచించారు.
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కొత్తూరు ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలన్నింటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. మొత్తం 53 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్,వైస్ చైర్మన్ డోలి రవీందర్,ఎమ్మార్వో రవీందర్ రెడ్డి,ఎంపీడీవో అరుంధతి, ఎంపీటీసీలు ఎర్రవెల్లి ప్రసన్న నాగరాజు చారి,రవీందర్ రెడ్డి,రాజేందర్ గౌడ్,కోఆప్షన్ సభ్యుడు విజయ్ పాల్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ తోట రాజగోపాల్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్ రెడ్డి,మాజీ సర్పంచులు అంబటి ప్రభాకర్, జండగూడెం సుదర్శన్ గౌడ్, రవి నాయక్,రాందాస్ నాయక్,గోవర్ధన్ గౌడ్,మామిడి సిద్ధార్థ రెడ్డి, మల్లేష్,మాజీ ఎంపిటిసి మోడీ దర్శన్,సురేష్ గౌడ్,రాజు గౌడ్,రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.