| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేశం లో అణగారిన వర్గాల అభివృద్ధియే మోడీ లక్ష్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశం లో అణగారిన వర్గాల అభివృద్ధియే మోడీ లక్ష్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలపై పన్నుల రూపంలో భారం మోపుతుంది

కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి

నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగుతున్న విజయసంకల్ప యాత్ర

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : విజయ సంకల్ప యాత్ర లో భాగంగా బుదవారం దేవరకద్ర నియోజకవర్గం ధన్వాడలో  రోడ్ షో మరియు విజయ సంకల్ప సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డికి ప్రజలు మహిళలు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు.వారితో పాటు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, బండారి శాంతి కుమార్, బంగారు శృతి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణమ్మ యాత్ర ప్రముఖ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, నాగు రావు నామూజి, పవన్ కుమార్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి  మాట్లాడుతూ

గతం లో బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రెండు సార్లు అధికారం లోకి వచ్చి, కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, ఆ డబ్బును ప్రజలపై పన్నుల రూపంలో దోపిడీ చేసారని అన్నారు.

బీఆర్ఎస్ పాలన లో రైతులను, నిరుద్యోగ యువత ను, మహిళలను, చేనేత వర్గాలను, పేద ప్రజలను దగా చేసారని అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీ లతో అధికారం లోకి వచ్చి, ఇప్పుడు కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆరు గ్యారంటీ లు నెరవేరుస్తామని ప్రజలు మోసం చేస్తున్నారని, కాంగ్రెస్  పార్టీ తెలంగాణా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే బిజెపి సహించదని హెచ్చరించారు.

పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై పన్నుల రూపం లో డబ్బులు వసూలు చేసి ఢిల్లీ కి పంపడమే వాళ్ళ పని అని అన్నారు.

గత పదేళ్లలో మోడీ  ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కోసం తొమ్మిది లక్షల కోట్ల పై చిలుకు నిధులు కేటాయించారని అన్నారు.

దేశం లో రైతులను, అణగారిన వర్గాలను, పేద ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని, కరోనా సమయం లో దేశం లో ప్రతీ ఒక్కరికి ఉచితంగా టీకాలు ఇచ్చారని, ఉచిత రేషన్ ఇచ్చారని అన్నారు.

ఆర్థిక రంగం లో భారతదేశం దూసుకుపోతుందని, మరో ఐదేళ్లలో  5వ స్థానం లో ఉన్న భారత్ ను 3వ స్థానం లోకి తీసుకురావడమే మోడీ  లక్ష్యమని అన్నారు.

కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కి సంపూర్ణ మద్దత్తు ఇవ్వాలని, తెలంగాణా నుండి అత్యధిక ఎంపీ లను గెలిపించుకోవాలని సూచించారు.

ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ

రెండవ రోజు విజయసంకల్ప యాత్ర లో భాగంగా వివిధ వర్గాల ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారని అన్నారు.

తెలంగాణా లో నలుగురు ఎంపీ లు ఉంటేనే బిజెపి ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్ల పై చిలుకు తెలంగాణా అభివృద్ధి కోసం ఖర్చు చేసారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణా నుండి అత్యధిక ఎంపీ లను గెలిపించాలని, తెలంగాణా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధి మోడీ ప్రభుత్వం తోనే సాధ్యమని, మరోసారి మోడీని ప్రధానిని చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమం లో పాలమూరు పార్లమెంట్ ముఖ్య నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Previous అవినీతి జ్యోతి కి రిమాండ్
Next అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT