డైలీ భారత్, ములుగు జిల్లా:మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఓ భక్తుడికి గుండెపోటు రావడంతో రెస్క్యూ టీమ్ కాపాడింది.
పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి ఈరోజు దర్శనం కోసం క్యూ లైన్ లో ఉండగా ఒకసారి రా గుండెనొప్పి రావడంతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు.
గమనించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే అతడికి కృత్రిమ శ్వాస అందించారు. అనంతరం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు...