| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి : మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి

విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి : మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి

 డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో SFI అధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థులకు  టాలెంట్ టెస్ట్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో  మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో మంగళవారం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ఆవిష్కరణ సభ డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ టాలెంట్ టెస్ట్ ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా డివిజనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్పీ తిరుపతి రావ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా తిరుపతి రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు , పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేసేందుకు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ లో అందరు విద్యార్థులు పాల్గొని తమ టాలెంట్ నిరూపించుకోవాలని అన్నారు. అదేవిధంగా పరీక్షలు అనగానే చాలామంది విద్యార్థులు భయపడుతున్నారని, ఆ భయాన్ని మెదడులో నుంచి పారదోయాలని తెలిపారు. సమాజంలో రుగ్మత లేని సమాజం కొరకు మీ మార్కులు ఉపయోగపడాలని కోరారు. నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు అంతా విద్యార్థుల చేతిలో ఉందని కావున ఈ దేశం సరైన మార్గంలో నడవాలంటే విద్యార్థులు బాగా చదువుకొని దేశం కోసం ఉపయోగపడాలని అన్నారు. దాంతోపాటు విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలు జోలికి పోకుండా సరైన పద్ధతిలో ఉండాలని కోరారు.

ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థుల కోసం నిరంతరం రాజి లేని పోరాటాలు నిర్వహించడమే కాకుండా ఇలాంటి టాలెంట్ టెస్ట్ పెట్టడం చాలా అభినందనీయమన్నారు

విశిష్ట అతిథిగా జిల్లా కార్యదర్శి కెలోత్ సాయి కుమార్ మాట్లాడుతూ..

గత 25 సంవత్సరాలు నుండి పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కోసం వారిలో ఉన్న నైపుణ్యత వెలికి తీయడానికి ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, అదే విధంగా చదివిన చదువు మార్కుల కోసమే కాకుండా సమాజ మార్పు కోసం చదవాలని, విద్యార్థులు తెచ్చుకునే అతి తక్కువ మార్కులు కూడా ఎదో ఒక రూపంగా సమాజానికి ఉపయోగపడాలి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ స్కూల్ అసిస్టెంట్ మేడం గిరిజ,  జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ సింహాద్రి,పట్టణ నాయకులు భూక్యా రాజేష్,ఎలియాజ్,వినయ్ ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు....

Previous ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేపట్టాలి : అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
Next రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ పాజిటివ్
ADVERTISEMENT