డైలీ భారత్, అనంతపురం:అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం (ABABS) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుచూరి సంజయ్ గురుస్వామి గత నెల 23న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుండి చేపట్టిన శబరిమల మహా పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది.
ఈరోజు ఉదయం పాల సముద్రం నుండి ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు సాయంత్రానికి వరలకొండ కు చేరుకున్నారు. రాత్రికి అక్కడ బస చేసి రేపు ఉదయం వరలకొండ నుండి శబరిమల మహా పాదయాత్ర ప్రారంభమై రేపు సాయంత్రానికి చిక్కబళ్లాపూర్ మీదుగా కర్ణాటక సరిహద్దుకు చేరుకుంటుందని సంజయ్ గురుస్వామి తెలిపారు.
రేపు సాయంత్రం కర్ణాటక అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు బళ్లారి నుండి వచ్చి పాదయాత్రలో కలుస్తారని ఆయన తెలిపారు.
#DailyBharath #Ayyappa #Sabarimala #Padayatra #SanjayGuruswamy #Anantapur