డైలీ భారత్, తిరువూరు:ఈరోజు తిరువూరు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం (ABABS) నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ పార్థసారధి రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు.
తిరువూరు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షుడు వల్లపు జగదీష్ భరద్వాజ్ కమిటీ బృందంతో వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ అన్నప్రసాద కార్యక్రమానికి భారీ ఎత్తున అయ్యప్ప భక్తులు, అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు వచ్చి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీష్ భరద్వాజ్ మాట్లాడుతూ, అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఎల్లప్పుడూ ఆ శ్రీ ధర్మశాస్త్ర సేవకు ABABS ముందుంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తిరువూరు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం నియోజకవర్గ కమిటీ దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సంక రాజారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
#DailyBharath #Tiruvuru #Ayyappa #ABABS #Annaprasadam #JagadishBharadwaj