| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు,జైలు శిక్ష..!

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు,జైలు శిక్ష..!

న్యాయస్థానం ఉత్తర్వులు బేఖాతరు చేసినందుకు.!

ఐఏఎస్ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.!

ఆరు నెలల సాధారణ కారాగారం, రూపాయలు 2000, జరిమానా..!

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను బేఖాతరు  చేసిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్ధారించింది జస్టిస్ కే.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా  విధిస్తూ తీర్పునిచ్చింది..

ఉల్లంఘన పై విచారణ సంచలన తీర్పు..!

న్యాయస్థానం ఆదేశించిన సమయంలో స్పందించకుండా పిటీషన్ దాఖలు అయ్యాక నామమాత్రంగానే ఉత్తర్వులు ఇవ్వడాని తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరనకు పాల్పడ్డారని నిర్ధారించింది ఐఏఎస్ స్థాయి అధికారి కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయడం సరికాదని ధర్మాసనం కఠిన నిర్ణయం తీసుకుంది..

అసలు ఏం జరిగిందంటే.?

రిజిస్ట్రేషన్ చట్టం 1908 లోని సెక్షన్ 22 ఏ ప్రకారం నిషేధిత ఆస్తులు జాబితా నుంచి కొన్ని ప్లాట్లను తొలగించాలంటూ బాధితులు దాఖలు చేసిన వినతిని పరిశీలించాలని గతంలో హైకోర్టు కలెక్టర్ ను ఆదేశించింది 2025 ఆగస్టులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అయితే కోర్టు నిర్దేశించిన 60 రోజుల గడువు ముగిసినప్పటికీ కలెక్టర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో బాధితులు 2025 అక్టోబర్ 15 కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు పిటీషన్ నమోదు అయిన తర్వాత యంత్రాంగం కదిలింది అధికారులు బాధితులకు నోటీసులు జారీ చేసి 2026 ఫిబ్రవరి 26న వారి వినతి తిరస్కరించారు ఆ తర్వాత జులై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేశారు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాత ఇలా ప్రక్రియను చుట్టేయడంపై ధర్మసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది..

Previous రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ!
ADVERTISEMENT