| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొత్త ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరం! లబ్ధిదారులతో కలిసి టపాసులు కాల్చిన షబ్బీర్ అలీ!

కొత్త ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరం! లబ్ధిదారులతో కలిసి టపాసులు కాల్చిన షబ్బీర్ అలీ!

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గం గార్గుల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గడ్డం గౌతమీ, కాసార్ల లయ, బొంబోతుల భారత్ గౌడ్ ల నూతన ఇందిరమ్మ గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా దీపావళి వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

చాలా సంవత్సరాలుగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న గడ్డం గౌతమీ, కాసార్ల లయ, బొంబోతుల భారత్ గౌడ్ కుటుంబాలకు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో వారి ఆనందంలో భాగస్వామ్యం అవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా గడ్డం గౌతమీ, కాసార్ల లయ, బొంబోతుల భారత్ గౌడ్ దంపతులకు స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

#DailyBharath #Kamareddy #ShabbirAli #Diwali #IndirammaHouse #Gargul

Previous ఇస్రోజివాడి గ్రామంలో ఘనంగా “ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమం
Next సికింద్రాబాద్ నుండి శబరిమలకు మహా పాదయాత్ర! 17వ రోజుకు చేరిన సంజయ్ గురుస్వామి యాత్ర!
ADVERTISEMENT