డైలీ భారత్, కామారెడ్డి: ఈరోజు ఇస్రోజివాడి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రతి ఇంటిని సందర్శించి, లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యతను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిందం మల్లేశ్, ఉపసర్పంచ్ సిద్ధం స్వామి, పంచాయతీ కార్యదర్శి రవీందర్ రావు పాలకవర్గ సభ్యులు షేక్ అజీజ్, లోకోటి మోహన్ రావు, దుబ్బాక సంతోష్, చెట్కూరి ప్రణీత్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్ లోకోటి సుదర్శన్ రావు, పీఏసీఎస్ డైరెక్టర్ కనకంటి చిన్న సాయిలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెట్కూరి అశోక్, డీకే స్వామి, పంచాయతీ కార్యదర్శి రవీందర్ రావు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చిందం మల్లేశ్ మాట్లాడుతూ, ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరుతుందని, లబ్ధిదారులందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.