| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జన సంద్రంలో యదేచ్ఛగా టపాసుల విక్రయాలు - అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్న టపాకాయల విక్రయదారులు

జన సంద్రంలో యదేచ్ఛగా టపాసుల విక్రయాలు - అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్న టపాకాయల విక్రయదారులు

నిజామాబాద్ లో టపాసుల విక్రయదారుల దందా! అధికారులు మౌనం... ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?

డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టపాకాయల విక్రయదారులు అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిత్యం రద్దీగా ఉండే కిసాన్ గంజ్ ప్రాంతంలో దీపావళి సందర్భంగా టపాకాయలు యదేచ్ఛగా విక్రయిస్తున్నారు.

పోలీస్ శాఖ, అగ్నిమాపక నిరోధక శాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పండగ సందర్భంగా యదేచ్ఛగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. జన సమూహాల మధ్య టపాకాయలు విక్రయించవద్దు అని నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని పెడచెవిన పెట్టి సైతం "మమ్మల్ని అడిగే వారు ఎవరు" అనే ధోరణిలో విక్రయాలు సాగిస్తున్నారు.

నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రమాదవశాత్తు అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే బాధ్యులు ఎవరు అని సగటు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వీరికి అడ్డుకట్ట వేయడంలో అధికారుల వైఫల్యమా.. లేక వారిని ఎవరు అడ్డుకుంటారో చూద్దామా అని విక్రయిస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


#DailyBharath #Nizamabad #Crackers #Diwali #KisanGanj

Previous కామారెడ్డి దుకాణాల యజమానులకు వార్నింగ్! కనీస వేతనం ఇవ్వకపోతే కఠిన చర్యలు
Next బతికుండగానే చచ్చిపోయినట్టు సర్టిఫికెట్! కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం రూ.13 లక్షల డీల్...
ADVERTISEMENT