| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఖమ్మంలో ఘోర విషాదం... బేతుపల్లి చెరువులో బోట్లు బోల్తా, 11 మంది రెస్క్యూ సిబ్బంది గల్లంతు!

ఖమ్మంలో ఘోర విషాదం... బేతుపల్లి చెరువులో బోట్లు బోల్తా, 11 మంది రెస్క్యూ సిబ్బంది గల్లంతు!

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో బుధవారం సాయంత్రం ఘోర విషాదం చోటుచేసుకుంది. రక్షణ చర్యల కోసం వెళ్లిన రెండు రెస్క్యూ బోట్లు బోల్తా పడటంతో SDRF సిబ్బంది, ఫైర్ సర్వీస్ అధికారులు, స్థానిక గైడ్లు సహా కనీసం 11 మంది రెస్క్యూ సిబ్బంది ఉధృత వరద నీటిలో గల్లంతయ్యారు.

అసలేం జరిగింది?

కుండపోత వర్షాలతో బేతుపల్లి చెరువు ఉధృతంగా పొంగిపొర్లింది. వలలు, చేపల కోసం స్థానిక మత్స్యకారులు చెరువు ఆలుగు దగ్గరకు వెళ్లగా, 8 మంది మత్స్యకారులు నీటి మధ్యలో చిక్కుకుపోయారు.

వారిని రక్షించేందుకు ముందుగా 3 మంది ఫైర్ సిబ్బంది బోటుతో వెళ్లారు. అయితే భారీ ప్రవాహంలో బోటు ఇంజిన్ ఫెయిల్ కావడంతో వారు కూడా నీటిలో చిక్కుకుపోయారు.

రక్షణే విషాదంగా మారింది:

సమాచారం అందుకున్న కొత్తగూడెం నుంచి 11 మంది ఎమర్జెన్సీ బృందం రెండు రెస్క్యూ బోట్లతో చేరుకుంది. ఆ బృందం చిక్కుకున్న ముగ్గురు ఫైర్ సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చింది.

అయితే తిరిగి వెళ్తుండగా రెండు బోట్లు బోల్తా పడటంతో 11 మంది రెస్క్యూ సిబ్బంది గల్లంతయ్యారు.

సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది:

జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. NDRF బృందాలు డ్రోన్లు, అత్యవసర పరికరాలతో గాలింపు చేపట్టాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా రాష్ట్ర నాయకత్వం సహాయక చర్యలను సమన్వయం చేస్తోంది.

#Khammam #Bethupalli #BoatCapsize #SDRF #BreakingNews #Telangana #Sathupalli

Previous శబరిమల మహా పాదయాత్ర 13వ రోజుకు చేరింది... రాప్తాడుకు చేరుకున్న సంజయ్ గురుస్వామి... అడుగడుగునా భక్తుల స్వాగతం!
Next లంచం తీసుకుని చెరువులో దూకిన SI... వెంటనే నీళ్లలోకి దూకిన విజిలెన్స్ అధికారి... సినిమాను మించిన డ్రామా!
ADVERTISEMENT