| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చిమ్మ చీకటిలో 16 మంది సేఫ్ - బేతుపల్లి విషాదం సుఖాంతం అయింది... మంత్రి తుమ్మల పర్యవేక్షణ!

చిమ్మ చీకటిలో 16 మంది సేఫ్ - బేతుపల్లి విషాదం సుఖాంతం అయింది... మంత్రి తుమ్మల పర్యవేక్షణ!

బేతుపల్లి చెరువు కథ సుఖాంతం - అందరూ సేఫ్!

డైలీ భారత్, బేతుపల్లి:  ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద జరిగిన దుర్ఘటన సుఖాంతమైంది. చిక్కుకున్న వారందరూ క్షేమంగా ఒడ్డుకు చేరారు.

ఏం జరిగింది?

8 మంది మత్స్యకారులు చిక్కుకోగా వారిని రక్షించేందుకు వెళ్లిన SDRF బృందాల పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. అయితే రాత్రి వేళ చిమ్మ చీకటిలో కూడా NDRF, SDRF, ఫైర్ సిబ్బంది చేసిన కృషితో 16 మంది సురక్షితంగా బయటికి రావడం ఆనందాన్ని కలిగించింది.

మంత్రి తుమ్మల సందర్శన:

బేతుపల్లి చెరువును సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు NDRF, SDRF, ఫైర్ సిబ్బందిని కలుసుకొని అభినందించారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున SDRF, NDRF, ఫైర్ సిబ్బందికి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అధికారులకు అభినందనలు:

సంఘటనను పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులకు మరియు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ కి మంత్రి తన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

జరిగిన సంఘటన నిన్న సాయంత్రం నుంచి మంత్రి తుమ్మల స్వయంగా పర్యవేక్షించి అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. వారికి బేతుపల్లి గంగార ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

#Bethupalli #Khammam #ThummalaNageswaraRao #NDRF #SDRF #Sathupalli #BreakingNews #DailyBharat

Previous ఇది గండి కాదు, 3 కోట్ల అవినీతికి పడిన చిల్లు... పెద్దవాగులో పెద్ద ప్రమాదం!
Next సిరిసిల్లలో రౌడీషీటర్లకు SP వార్నింగ్... అర్ధరాత్రి ఇళ్లపై ఆకస్మిక తనిఖీలు!
ADVERTISEMENT