| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రేగుల్ల నుండి గొడుగుబండ వెళ్లే రహదారికి మోక్షమెప్పుడో..?

రేగుల్ల నుండి గొడుగుబండ వెళ్లే రహదారికి మోక్షమెప్పుడో..?

డైలీ భారత్, తుమ్మలగూడెం:కరకగూడెం మండల పరిధిలోని తుమ్మలగూడెం పంచాయితీ రేగుళ్ళ నుండి గొడుగుబండ వెళ్లే ప్రధాన రహదారి సమస్యతో రేగుళ్ళ గ్రామ ప్రజలు 5 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పూర్తిగా దెబ్బతిని, అడుగడుగునా గుంతలు ఏర్పడి చెరువును తలపిస్తుంది. నిత్యం రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. వర్షం నీరు గుంతల్లో నిలిచి ఉండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు చాలాసార్లు కిందపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు రాకపోకల సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఐదు సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీస మౌలిక సదుపాయమైన రహదారిని కల్పించడంలో ఇంత జాప్యం ఎందుకని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామ రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరుతున్నారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Previous సిరిసిల్లలో రౌడీషీటర్లకు SP వార్నింగ్... అర్ధరాత్రి ఇళ్లపై ఆకస్మిక తనిఖీలు!
Next పాత ఢిల్లీలో ఘోరం: చావ్డీ బజార్‌లో మూడంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి... పలువురు చిక్కుకున్నట్లు అనుమానం!
ADVERTISEMENT